బాలయ్య వర్సస్ ముమ్ముట్టీ.. అదీ నటన అంటే..?

Chakravarthi Kalyan

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. ముందు దీన్ని ఓ రాజకీయ సినిమా అనుకున్నా.. ప్రజల కష్టాలను తెరపై ఆవిష్కరించిన తీరు.. ఓ నాయకుడి ప్రస్థానాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల అంతరంగాలను తాకింది.



ఈ సినిమా ద్వారా మమ్ముట్టి ఎందుకు రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అయ్యాడో మనకు తెలిసిపోతుంది. ఎంత వద్దన్నా.. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ఎన్టీఆర్ సినిమాతో పోలిక తీసుకురాక తప్పదు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య కంటే.. యాత్రలో మమ్ముట్టీ అద్భుతంగా చేశాడన్నటాక్ బాగా వస్తోంది.



బాలయ్యకు ఎన్టీఆర్ పాత్ర పోషించడానికి ప్లస్ పాయింట్లు అనేకం ఉన్నాయి. వారసత్వం , పోలికలు బాలకృష్ణకు కలసి వచ్చాయి. కానీ.. వైఎస్ తో ఏమాత్రం పోలిక లేకపోయినా.. వైఎస్ మేనరిజాన్ని అనుకరించకపోయినా.. వైఎస్ ఆత్మను మమ్ముట్టి ఆవిష్కరించిన తీరు అసలైన నటుడికి అద్దం పడుతుంది.



యాత్ర సినిమా మొదలైన కొద్ది సేపటికే తెరపై మమ్ముట్టి మాయమైపోతారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డే మనకు సినిమాలో కనిపిస్తారు. సినిమా చివరిలో వైఎస్ అసలు విజువల్స్ చూపించే వరకూ మనం ఇప్పటివరకూ చూసింది రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించిన మమ్ముట్టిని అనే విషయం గుర్తుకురానే రాదు.. దటీజ్ మమ్ముట్టి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: