ఎంత ఘాటు ట్రైలరో.. ఒక్కరోజులోనే 30 లక్షల వ్యూస్..

Chakravarthi Kalyan

ఓవియా.. తమిళంలో ఈ పేరొక సంచలనం.. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు తమిళంలో 90 ఎం ఎల్ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన ఒక్క రోజులోనే 3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.



సాధారణంగా బిగ్ హీరోల ట్రైలర్స్ కే ఈ స్థాయి క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈ చిన్న సినిమాకు కూడా ఈ స్థాయి వ్యూస్ రావడం సంచలనమే. ఈ వ్యూస్ కు ఓవియా క్రేజ్ ఓ కారణమైతే.. ట్రైలర్‌ లో దట్టించిన మసాలా కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.



అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆ స్థాయికి తగ్గట్టుగానే ఉంది. ఏకంగా సినిమా పేరే 90 ఎంఎల్ కావడంతో మరి కంటెంట్‌ అంతకుమించి ఎలా ఆశిస్తాం. లిప్ టు లిప్పు కిస్సులు.. శృంగార సన్నివేశాలు బాగా కూర్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.



అయితే ఈ ట్రైలర్ పై విమర్శలు కూడా ఈ స్థాయిలోనే వస్తున్నాయి. ఓవియాకు మంచి క్రేజ్ ఉందని.. ఆ క్రేజ్ ను ఇలాంటి సినిమాకు ఉపయోగిస్తారా అని ఆమె అభిమానులు కూడా నిరసిస్తున్నారు. ఓవియా.. మిమ్మల్ని చాలామంది అభిమానించి అనుసరిస్తారు..మీరు ఇలాంటి సినిమాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.. ఓవియా మాత్రం సినిమా చూడకుండా అప్పుడే జడ్జ్ చేయకండని సలహా ఇస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: