మహేశ్ కు గాలం వేస్తున్న బాబు.. వర్కవుట్ అవుతుందా..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం చంద్రబాబు హీరో మహేశ్ బాబు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆసక్తిరేపుతున్నాయి. ఇప్పటికే ఆయన బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఎంపీగా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమైన గల్లా.. 2014 ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుంది.



దీనికితోడు ఇటీవల మహేశ్ బాబు బాబాయి ఆదిశేషగిరిరావు కూడా టీడీపీలో చేరారు. ఇన్నాళ్లూ వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికల ముందు టీడీపీలో చేరడం విశేష।ం. గతంలో కృష్ణ భార్య విజయ నిర్మల కూడా టీడీపీలో కొన్నాళ్లపాటు పని చేశారు. ఈ సమీకరణాల నేపథ్యంలో మహేశ్ బాబు మద్దతు సంపాదించొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.



మహేశ్ బాబు కూడా మనవాడే .. వచ్చే ఎన్నికల్లో మనకు సహాయపడతాడు.. అని చంద్రబాబు తన సన్నిహిత నేతలతో అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. బంధువులంతా టీడీపీలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అలా ఆశించడంలో విశేషం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయొచ్చు.



ఐతే.. మహేశ్ బాబు.. ఎంతవరకూ ఈ ఒత్తిళ్లకు లొంగుతాడన్నది సందేహాస్పదం. ఎందుకంటే గతంలో సొంత బావ గల్లా జయదేవ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తాడని అంతా ఊహించారు. కానీ మహేశ్ బాబు మాత్రం ప్రచారానికి రాలేదు. కేవలం ట్విట్టర్లో గల్లా జయదేవ్ కు ఓటేయండని ఓ పిలుపు ఇచ్చి ఊరుకున్నారు. మరి ఇప్పుడు మాత్రం రంగంలోకి దిగుతారా.. చూడాలి చంద్రబాబు ఎలా మహేశ్ బాబును ఒప్పిస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: