మళ్లీ మొదలైన చిరంజీవి- మోహన్ బాబు మాటల యుద్ధం..?

Chakravarthi Kalyan

మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఉన్న సంబంధం సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. గతంలో సినీ స‌్వర్ణోత్సవ సమయంలో జరిగిన లెజెండ్ గొడవ అంత సులభంగా ఎవరూ మరచిపోలేరు. ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం అరుదుగా మారింది.



తాజాగా వీరిద్దరూ టీఎస్సార్ అవార్డుల ఫంక్షన్‌ లో ఒకే వేదికపై మెరిసారు. చిరంజీవి తన ప్రసంగం ప్రారంభిస్తూ..  పెద్దాయన మోహన్‌బాబు’ అని సంబోధించారు. దానికి మోహన్‌బాబు నవ్వేస్తూ.. నేను పెద్దాయన ఏంటి? అని అడ్డుపడ్డారు. అంతే చిరంజీవి మళ్లీ సెటైరే వేస్తూ.. పోనీ.. కుర్రాయన’ అంటూ చమత్కరించారు .



అందరికీ అవార్డులు వచ్చాయి.. నాకే ఏ అవార్డూ రాలేదు’ అని చిరంజీవి అన్నప్పుడు.. ‘నీకు అవార్డు రాలేదు కదా? నాకొచ్చిన గురువుగారి అవార్డు నీకే ఇస్తున్నా’ అని తన పురస్కారాన్ని చిరంజీవికి మోహన్‌బాబు తిరిగి ఇవ్వబోయారు. ‘నాకు ఇవ్వడం ఏమిటి? మనం కలిసి పంచుకుందాం’ అంటూ   మోహన్‌బాబుని దగ్గరకి తీసుకున్నారు చిరు.



 రామ్‌ చరణ్‌కి అవార్డు రావడం, అది నా చేతుల మీదుగా తీసుకోవడం పుత్రోత్సాహాన్ని కలిగించిందంటూ ఆనందపడిపోయారు చిరంజీవి. అవార్డు’ల ప్రదాన కార్యక్రమంలో 2017, 2018 సంవత్సరాలకు గానూ పలు విభాగాల్లో పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబులకు ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: