ఈ మద్య తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న టివి షో ‘జబర్థస్త్’.ఈ మద్య 'జబర్దస్త్' కామెడీ షో ఎక్కువ శాతం వల్గారిటీ..డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కొన్ని స్కిట్స్ కొంత మంది మనోభావాలు దెబ్బతినేలా చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా వచ్చాయి. కోర్టు వరకు వెళ్లిన ఈ గొడవలు తర్వాత సర్ధుమణిగాయి. ఒక వర్గం వారిని కించపరిచేలా స్కిట్ చేశారని కమెడియన్ వేణు ని కొంతమంది కొట్టడం కూడా జరిగింది.
ఇలా కామెడీ పక్కన బెట్టి బూతులలో జబర్ధస్త్ కామెడీ చేస్తున్నారంటూ మహిళాసంఘలు ఆరోపిస్తున్నారు. వెకిటి చేష్టలు, వెకిలి నవ్వులు నవ్వడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తున్న అనసూయ, రష్మి లపై సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబును కూడా కొంతమంది విమర్శించారు. ఆ విమర్శలను గురించి తాజా ఇంటర్వ్యూలో నాగబాబు స్పందించారు. జబర్ధస్త్ కామెడీ షో అందరిని నవ్వించడానికే చేస్తున్న కార్యక్రమం అని..ఇందులో అసభ్యత అనేతి ఎక్కడ ఉన్నా ముందే అభ్యంతరం చెబుతామని కాకపోతే చమ్మక్ చంద్ర చేసే కొన్ని స్కిట్స్ లోనే కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందని..ఆ తరహాలో నవ్వించడం చమ్మక్ చంద్ర స్టైల్ అన్నారు.
కొంతమంది విమర్శిస్తున్నట్టుగా 'జబర్దస్త్' చూడలేనంత భయంకరమైన షో ఏమీ కాదు. మరీ అంత అసభ్యంగా ఉంటే జబర్ధస్త్ ఇంత హిట్ అయ్యేదే కాదని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లకు వచ్చే బూతు సినిమాలు చాలానే ఉంటున్నాయి. వాటితో పోలిస్తే 'జబర్దస్త్'లో చూపించేది నథింగ్" అంటూ తేల్చి చెప్పారు.