ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!

siri Madhukar
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవితో ఆయన ‘ఇంట్లో రామయ్య-విధిలో కృష్ణయ్య’ తీసి దర్శకుడిగా మొదటి సినిమాతోనే సత్తా చాటారు.  ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే నటిడిగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.  కోడి రామకృష్ణ ఎక్కువగా కామెడీ సినిమాల్లోనే నటించారు.  నిన్న మరణించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి.  పెద్ద కూతురు దీప్తి తన తండ్రికి ఖర్మ కాండలు నిర్వహించారు.

మొదట ఆయన ఇంట్లోనే పార్థివదేహాన్ని ఉంచగా చివరి చూపుకోసం  సినీ ప్రముఖులు ఆయనను కడసారి చూసేందుకు వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున సహా పలువురు నటీనటులు, రాజకీయ నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  తర్వాత కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్ కు తరలించారు.

అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి భౌతికకాయాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  పెద్ద కూతురు దీప్తి తన తండ్రికి ఖర్మ కాండలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు  చేసుకొని కంటతడి పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: