"అద్నాన్ సమీ" జన్మతహః పాకిస్తానీ స్పందన తీరు అద్భుతం

ప్రభుత్వాల సహజవిధి ప్రజలకు శాంతియుతమైన ప్రశాంత జీవితాన్ని తమ ప్రజలకు అందించాలి. వారి జీవనంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా ఒక ప్రక్క దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమర్ధతను కాపాడుతూ చూడవలసిన బాధ్యత ఉంది. అలా జరగని నాడు ఆదేశ ప్రజలు వీలైతే గుణాత్మక విలువలు ప్రశాంత జీవితాన్ని ఇవ్వగల దేశాలకు వలస పోవటం తధ్యం. 

టాలీవుడ్ లో వర్షం, ఊసరవెల్లి, 100 పర్సంట్ లవ్, లాంటి సినిమాల్లో పాటలు పాడి తెలుగువారికి కూడా పరిచయమైన అద్భుత గాయకుడు అద్నాన్ సమి బాలీవుడ్లో కూడా లెక్కలేనన్ని పాటలు పాడాడు. అతను జన్మతహ పాకిస్థానీ. అక్కడే పుట్టాడు. అక్కడే పెరిగాడు. ఆ తరవాత భారతీయ సినిమాల్లో ఆయనకు అనేక్ అవకాశాలు రావడం, పైగా పాకిస్థాన్‌ లో పరిస్థితులు జీవన ప్రమాణాలు అధ్వాన్నంగా ఉండటంతో అక్కడి నుంచి భారత్ కు ఒక కళాకారుడుగా వలస వచ్చేశాడు. భారతీయ పౌరసత్వం కూడా తీసుకుని భారతీయుడుగా సెటిలైపోయాడు. 

"పాకిస్థాన్ నుంచి వచ్చాడు కదా! ఎంతైనా సొంత దేశం మీదే ప్రేమ ఉంటుందని, తనదేశం తప్పు చేసినా ఊరుకుంటాడు" అని అంతా అనుకున్నారు. కానీ పుల్వామా ఉగ్ర దాడికి బదులుగా భారతీయ వాయు దళం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ మెరుపు దాడిలా చేసిన నేపథ్యంలో అతను పూర్తిగా భారత్‌ కే మద్దతు ఇచ్చాడు. పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ కూడా చేశాడు. భారత్ చేసిన ప్రతీకార దాడి మీద పాకిస్థానీయులు సోషల్ మీడియా లో వక్రీకరణలు చేస్తుండటం, ఈ సంధర్భంగా తనను కూడా ట్రోల్ చేస్తుండటంతో గతంలో పాకిస్తానీగా అద్నాన్ సమీ స్పందించాడు. 

"ప్రియమైన పాకిస్థానీ ట్రోల్స్! ఇది మన ఆహాల్ని పక్కనపెట్టి వాస్తవాలను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. మీకు కూడా శత్రువులు అయిన ఉగ్రవాదుల్ని అంతమొంచే తరుణ మిది. మీమూర్ఖపు ఆలోచన నవ్వుతెప్పిస్తోంది. వాతావరణం వాస్తవికతను ఎత్తిచూపిస్తున్నా, మీకు, ఒక బకెట్ మలినానికి మధ్య తేడా "బకెట్" మాత్రమే" అంటూ గట్టిగా పాకిస్థానీలకు తిట్లతో బలమైన పంచ్ ఇచ్చాడు అద్నాన్ సమీ. 


తన ట్విట్టర్ ప్రొఫైల్లో - తన గురించిన విశేషణలో ప్రౌడ్ ఇండియన్ అని పేరు పెట్టుకోవడం ఒక గొప్ప విశేషం. ఒకప్పుడు దాదాపు 200కిలోల దేహభారంతో కదలడానికి కూడా ఇబ్బందిపడ్డ అద్నాన్ సమీ-సర్జరీ చేయించుకుని బాగా సన్నబడి సాధారణవ్యక్తిగా మారిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఆ తర్వాత ఆయన భారత్‌కు వచ్చి స్థిర పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: