తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో విజయ్. ఇటీవల విజయ్ నటించిన అదిరింది, సర్కార్ తెలుగు లో ఘనవిజయాలు సాధించాయి. వాస్తవానికి ఈ రెండు చిత్రాలు మొదట ఎన్నో కాంట్ర వర్సీలు ఎదుర్కొన్నా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపాయి. షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఆ రేంజ్ లో అభిమానులు అక్కడికి చేరుకుంటూ వుంటారు. వాళ్లు తమ అభిమానాన్ని ప్రదర్శించే తీరు ఒక్కోసారి విజయ్ ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు వున్నాయి.
ఆ మద్య హీరో సూర్య కాకినాడలో ఓ థియేటర్లోకి వస్తే ఫ్యాన్స్ చేసిన హంగామాకు వెనుక గేటు నుంచి దూకి మరీ పారిపోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా అలాగే అయ్యిందట. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక కాలేజ్ లో ఈ సినిమా షూటింగును ముగించుకుని విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు.
అయితే విజయ్ కారు వెంట కొంత మంది కుర్రాళ్లు ‘తైలైవా..’అంటూ వెంటపడటంతో విజయ్ తన కారు గ్లాస్ కిందకు దింపి వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కోరారట. గతంలో ఇదే సంఘటన హీరో అజిత్ కి కూడా జరిగిందట..దాంతో ఆయన కారు ఆపి ఇలాంటి పనులు చేయొద్దని వారికి నచ్చజెప్పి వెనక్కి పంపారట.