ప్రముఖ సినీ నటి మృతి!

Edari Rama Krishna
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ కన్నడ సినీ నటి ఎల్‌వీ శారద (78) గురువారం బెంగళూరులో కన్నుమూశారు.  ‘వంశవృక్ష’ చిత్రంతో ఆమె కన్నడ రంగంలోకి నటిగా అడుగుపెట్టారు.  తన మొదటి చిత్రంతోనే  రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు.  ఆమె ఎక్కువగా ఆద్యాత్మిక చిత్రాల్లో నటించారు. 

శంకరాచార్య, మధ్వాచార్య, నక్కళారాజకుమారి, ఒందు ప్రేమ కథ  చిత్రాలు ఎంతో పేరు తీసుకు వచ్చాయి.  కొంత కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఆ తర్వాత పలు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకతక్వం వహించారు.

కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బెంగళూరులోని శంకర హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: