యాక్షన్ సీన్స్ పై విరక్తి పెంచుకున్న ప్రభాస్ !

Seetha Sailaja
‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ కి ఎదిగిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడం కోసం ‘సాహో’ సినిమాలో విపరీతంగా యాక్షన్ సీన్స్ కోసం కష్టపడుతున్న విషయం తెలిసిందే. ‘సాహో’ మూవీలోని ఒక యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ మూడు రోజులపాటు రోజుకు 12 గంటల చొప్పున కష్టపడ్డాడు అంటే ‘సాహో’ యాక్షన్ సీన్స్ ఏవిధంగా ఉంటాయో అన్న విషయం క్లారిటీ వచ్చి అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ‘సాహో’ తో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం ఇప్పటికే యూరప్ లో చిత్రీకరించిన రెండు ఫైట్ సీన్స్ ను తొలిగించమనీ ప్రభాస్ రాథాకృష్ణకు సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఈమూవీలో ఒక యాక్షన్ సీన్ కూడ పెట్టే ఆలోచన చేయవద్దని ప్రభాస్ రాథాకృష్ణకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం తన సినిమాల విషయంలో ఇలా యాక్షన్ సీన్స్ ను పెంచుకుంటూ వెళ్ళిపోతే దానికి ఒక పరిమితి ఉండదని అభిమానుల అంచనాలు పెరిగిపోయి వాటిని అందుకోవడం కష్టం అన్న అభిప్రాయంలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో 1940 కాలంనాటి కథతో ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీలో ఒక్క ఫైట్ సీన్ కూడ ఉండదు అన్న లీకులు వస్తున్నాయి.

ప్రభాస్ అంటే యాక్షన్ హీరో అన్న ఇమేజ్ నుండి బయటపడాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ నిర్ణయం అని అంటున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అతడి భారీ ఫైట్ సీన్స్ కు అలవాటు పడిపోయిన నేపధ్యంలో ఈ లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలను ఎంత వరకు హర్షిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: