కోన వెంకట్ కామెంట్స్ తో పవన్ అయోమయం !

Seetha Sailaja
సినిమా రచయితగా విపరీతమైన పాపులారిటీ సంపాదిచుకున్న కోనవెంకట్ ఈమధ్య నిర్మాత గా మారడంతో ఇతడి హవా చాలావరకు తగ్గింది. పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా సినిమా తీయడమే కాకుండా ఆ సినిమాకు దర్శకత్వం వహించాలి అని ఆలోచనలు చేస్తున్న ఈ విలక్షణ రచయిత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

కోన వెంకట్ సినిమా రచయిత  మాత్రమే కాకుండా  రాజకీయ నేపధ్యం వున్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి  కావడంతో పవన్ 'జనసేన' కు సంబంధించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ వ్యక్తిత్యం తనకు పూర్తిగా తెలుసు అని చాలా నిజాయితీతో ఉండే పవన్ ఆలోచనలను ప్రస్తుతం కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు జయాపజయాలతో  సంబంధంలేకుండా పవన్ లాంటి వ్యక్తి ఒంటరి పోరాటం చేస్తాడు అని తాను భావించిన విషయాన్నీ వివరించాడు. అయితే పవన్ తనకు తెలియకుండానే తనకు తానుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కొందరి చేతిలో కీలు బొమ్మగా మారిపోవడం దురదృష్ష్టం అంటూ కోన వెంకట్ కామెంట్స్ చేసాడు.  

 అంతేకాదు  ఒంటరి పోరు సాగించిన వ్యక్తి ని మాత్రమే జనం వీరుడుగా చూస్తారని  పవన్ వ్యక్తిత్యం పై జనంకు ఉన్న అభిప్రాయాలు రీత్యా పవన్ ను వీరుడుగా చూడాలని అనేక మంది అభిలషిస్తే పవన్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి కూడా సాధారణ రాజకీయ వేత్తగా మారిపోవడం తనకు అత్యంత ఆశ్చర్యంగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కోన వెంకట్. దీనితో పవన్ కూడా తన అన్న చిరంజీవి లాగ వ్యూహాత్మక తప్పులు చేస్తూ రాజకీయాలలో రాణించలేని మరో ఫిలిం సెలెబ్రెటీగా మారిపోతాడా అని అనిపించడం సహజం.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: