ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో తెలుసా.. అందాల తారని ఇలా మార్చేశారు..!

shami
యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ ఎంతోమందికి స్పూర్తిదాయకం. యాసిడ్ దాడి తర్వాత ఆమె కొద్ది కొద్దిగా కోలుకుని ఆత్మవిశ్వాసం పోగేసుకుని తనలా యాసిడ్ దాడి జరిగిన బాధితులకు ఆసరాగా నిలబడ్డది. ఇప్పుడు ఆమె కథతో ఇప్పుడు సినిమా వస్తుంది. మేఘనా గుల్జార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా చపాక్ అని పెట్టారు. 


సినిమాలో లీడ్ రోల్ లో దీపికా పదుకునే నటిస్తుంది. సినిమా నుండి ఫస్ట్ లుక్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. యాసిడ్ దాడి జరిగిన మహిళ పాత్రలో దీపిక నటిస్తుంది. ఫస్ట్ లుక్ లో దీపిక లుక్ వావ్ అనిపించేలా ఉంది. సినిమా కథకు తగినట్టుగా ప్రొస్థెటిక్ మేకప్ తో దీపికా ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది.


A character that will stay with me forever...#Malti

Shoot begins today!#Chhapaak

Releasing-10th January, 2020.@meghnagulzar @foxstarhindi @masseysahib pic.twitter.com/EdmbpjzSJo

— Deepika Padukone (@deepikapadukone) March 25, 2019
స్పూర్తిదాయకమైన కథతో వస్తున్న ఈ ఛపాక్ సినిమాతో దీపిక నటిగా తన సత్తా చాటుతానని చెబుతుంది. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా బీ టౌన్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దీపికా పదుకునే చపాక్ సినిమాలో లక్ష్మి రోల్ లో అందరికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. 2020 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.


ఈ ఫస్ట్ లుక్ చూసిన లక్ష్మి అగర్వాల్ తన రెస్పాన్స్ అందించారు. నా పాత్రను దీపిక పోశిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. ఆమె ఎన్నో మంచి చిత్రాలు చేశారు.. ఆ పాత్రను కూడా అంతే గొప్పగా చేస్తారని భావిస్తున్నానని అన్నారు. దీపిక ఫస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: