మొత్తం మీద నా డ్రీమ్ నెరవేరింది అని తెలిపిన నిహారిక..!
ఈ వార్త సినిమా ప్రారంభంలోనే వచ్చినా గానీ చాలామంది రూమర్ అనుకున్నారు. కానీ తాజాగా సూర్యకాంతం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నిహారిక ఈ విషయం తెలపడంతో సైరా సినిమాలో నిహారిక నటించిన విషయం నిజమేనని తేలింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రెండు సన్నివేశాలలో కనిపిస్తానని తెలిపింది. అందులో ఒక సన్నివేశం చాలా ప్రత్యేకమైనదని తెలిపింది.
ఆ సీన్ లో తన నటన ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందని వెల్లడించింది. మెగాస్టార్ సినిమాలో నటించాలని కలలు కన్నానని.. ఆయన సినిమాలో ఒక్క నిముషం పాటు కనిపించినా చాలని.. ఆ కల 'సైరా' ద్వారా తీరుతోందని తెలిపింది. ఇదే క్రమంలో సూర్యకాంతం గురించి మాట్లాడుతూ...మంచి ఎంటర్టైనర్ సినిమా అని సమ్మర్ లో కుటుంబపరంగా చూడాల్సిన సినిమా అని తెలిపింది నిహారిక.