పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్న బండ్లగణేష్..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీడియా ముందుకు వచ్చి సెవన్ ఓ క్లాక్ బ్లేడుతో కెమెరా ముందు పీక కోసుకుని చనిపోతా అని ఛాలెంజ్ చేసిన బండ్ల గణేష్ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన దేవుడు దైవం అనే మరియు బాస్ అని పిలిచుకొనే పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో.


 “నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు….నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్ గారిని ఏపీ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి….మీ బండ్ల గణేష్” అని పెట్టారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోష పడుతున్నారు.

నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు....
నా దైవం, నా బాస్..
పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి....
మీ
బండ్ల గణేష్

— BANDLA GANESH (@ganeshbandla) April 4, 2019 కచ్చితంగా సమాజంలో పవన్ కళ్యాణ్ మార్పులు తీసుకు వస్తారని కొత్త రాజకీయ నాయకుడిని తనలో నుండి సమాజానికి పరిచయం చేస్తానని మరికొంతమంది మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు బండ్ల గణేష్ పెట్టిన కామెంట్ కి. మొత్తంమీద ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై మరోసారి తన భక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: