వామ్మో నేను ఏపార్టీకి మద్దతు ఇవ్వలేదు బాబోయ్..నన్ను వదిలేయండి!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత స్వామి రారా, కార్తికేయ, ఎక్కడి పోతావు చిన్నవాడ, కేశవ లాంటి చిత్రాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ప్రస్తుతం నిఖిల్‌ `అర్జున్‌ సురవరం`  చిత్రంలో నటిస్తున్నాడు.  ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.  వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో రావాల్సి ఉన్నా టైటిల్ విషయంలో కొన్ని ఇబ్బందులు రావడంతో కొత్త టైటిల్ తో మే 1 ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుంది.  ప్రస్తుతం ఏపిలో ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో సినీ తారలు అభ్యర్థుల తరుపు నుంచి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా డోన్ లో తమ కుటుంబ సభ్యుడు కేఈ ప్రతాప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నిఖిల్ తెలిపాడు. కేఈ ప్రతాప్ చాలాచాలా మంచి వ్యక్తి అనీ, నిజాయతీ ఉన్న వ్యక్తి అని వ్యాఖ్యానించాడు.  తనకు కేఈ ప్రతాప్ 25 ఏళ్లుగా తెలుసనీ, అందుకే ఆయనకు ఓటేయాల్సిందిగా ప్రచారం చేశానని స్పష్టం చేశాడు.

దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో దుమ్మురేపింది.  తాను ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్త ట్రెండింగ్ అవుతోందని టాలీవుడ్ హీరో నిఖిల్ తెలిపాడు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదనీ, తాను ఓ పార్టీకీ సపోర్ట్ చేయడం లేదని నిఖిల్ తేల్చిచెప్పాడు.  ప్రస్తుతం రాజకీల గురించి పుట్టించుకునే టైమ్ లేదని..నటుడిగా తన కెరీర్ ముందుకు ఎలా సాగుతుందనేదానిపైనే దృష్టి ఉందని..దయచేసి తనను రాజకీయాల్లోకి లాగవొద్దని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: