ఈసారి పవన్ కళ్యాణ్ కోసం అల్లు అరవింద్..!

KSK
ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో జనసేన పార్టీ తరఫున ఇప్పటికే చాలా చోట్ల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం నుండి నాగబాబు, నిహారిక, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా తన వంతుగా జనసేన పార్టీకి మద్దతు తెలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


అయితే బహిరంగంగా కాకుండా జనసేన పార్టీ బ్యాక్ సపోర్ట్ గా ఉండటానికి రెడీ అయినట్లు ఫిలిం నగర్ టాక్. ఇందుమూలంగా నే అల్లు అరవింద్ కొత్త సినినిమాలేవీ అనౌన్స్ చేయలేదు. మొదలవడానికి సిద్ధంగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలు కూడా నిలిచిపోయినట్లు ఇండస్ట్రీ టాక్.


మొత్తంమీద చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక గీతా ఆర్ట్స్ కి సంబంధించిన సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: