మేం చనిపోయామా? ఓట్ల గల్లంతుపై రష్మి సీరియస్!

siri Madhukar

జబర్ధస్త్ కామెడీ షోతో తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది యాంకర్ అనసూయ.  ఆ తర్వాత వివిధ ప్రైవేట్ కార్యక్రమాలు, ఛానల్స్ లో చాన్స్ రావడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.  ఆమె స్థానంటో అప్పటి వరకు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించిన రష్మి గౌతమ్ ని యాంకర్ గా పరిచయం చేశారు జబర్ధస్త్ కామెడీ షోకి..అప్పటి నుంచి అనసూయను మరిపించింది రష్మి.  


తెలుగు లో ఇప్పుడు టాప్ హాట్ యాంకర్లు ఎవరంటే వెంటనే అనసూయ, రష్మి ల పేర్లే వినిపిస్తాయి.  అయితే జబర్ధస్త్ కామెడీ షోతో వచ్చిన గుర్తింపు రష్మికి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.  అప్పటి వరకు వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించే రష్మి ఏకంగా హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.  దాంతో ఆమె జబర్ధస్త్ నుంచి ఔట్ అవుతుందేమో అనుకున్నారు..కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా హిట్ కాకపోవడంతో జబర్ధస్త్ లోనే కొనసాగుతుంది.  


ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మి తాజాగా ఎన్నికల సంఘంపై మండిపడింది.  తన ఓటుకి సంబంధించిన స్లిప్ కానీ, లిస్టు కానీ ఇంతవరకు అందలేదని వాపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. ఒటు హక్కు వినియోగించుకోవాలని చెబుతున్న తమకే ఓటు లేక పోవడం ఆశ్చర్యమని అంటుంది.  


తన తల్లితో కలిసి ఓటు వేయడం కోసం వైజాగ్ వెళ్తే.. తమ ఓట్లకి సంబంధించిన లిస్టు అందించలేదని, ఎప్పటి నుండో వైజాగ్ లోనే ఉంటున్నామని, ఓటర్ ఐడీ ఇక్కడే ఉందని అయితే తమతో పాటు ఆ ఏరియాలో ఎవరికీ ఓటర్ స్లిప్ లు అందలేదని చెప్పుకొచ్చింది.  ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకుందామను కుంటే.. ఎలెక్షన్ కమిషన్ వెబ్ సైట్ అందుబాటులో లేదంటూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కొద్దిసేపటి తరువాత చివరకి తనకు ఓటు స్లిప్ దొరికిందని, తన తల్లి ఓటు స్లిప్ ఇంకా దొరకలేదంటూ సోషల్ మీడియాలో తెలిపింది.



Me and my mother have still not received our voters sheet and what came into light yesterday was that an entire building was not on voters sheet until they threaten the authorities that they wud raise a complaint

— rashmi gautam (@rashmigautam27) April 10, 2019I’m not a first time voter and my voters id and permanent address has always been Vizag so me being on any other list is imp
I’m gona wait till today evening

— rashmi gautam (@rashmigautam27) April 10, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: