వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపొయింది ..!

Prathap Kaluva

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. చంద్రబాబు చేస్తున్న హంగామా గిరించి స్పందించారు. ఓటమిని జీర్ణించుకోలేక ఇలా చిల్లర వేశాలు వేస్తున్నారని ఇదేనా 40 ఏళ్ల రాజకీయమని మండి పడ్డారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. 2014లో ఈవీఎంలపై రాని అనుమానాలు ఇప్పుడు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. గెలిస్తే ఈవీఎంల పనితీరు అద్భుతమా.. లేకపోతే తప్పా అంటూ ప్రశ్నించారు.


ప్రజలపై నమ్మకం లేకనే ఢిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.   ప్రచారంలో వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పనైపోయిందని అర్ధమైందన్నారు కేటీఆర్. 40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి.. ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలన్నారు. ఎన్నికల సంఘం అధికారుల్ని బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 


తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు టీఆర్ ఎస్ పాలనకు అద్దం పడుతోందని.. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు వాళ్ల పాలనకు అద్దం పడుతోందని అభిప్రాయపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం.. ట్యాంపరింగ్ జరిగితే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. రేపు చంద్రబాబు పొరపాటున గెలిస్తే అప్పుడేమంటారని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: