చిరంజీవి ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్ - సైరా కంటే పెద్ద సినిమా ?
రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. మరియు అదే విధంగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార సుదీప్ విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా పై ఫోకస్ పెట్టారు.
అంజి తర్వాత మళ్ళీ ఫిక్షన్ మూవీలో నటించిన చిరు ఈ సినిమా తర్వాత కూడా మరో భారీ సినిమానే చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.అందులోను సోసియో ఫాంటసీ చిత్రాన్ని తీసేందుకు చిరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని మెగా కాంపౌండ్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు. మరొకసారి సోషల్ ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. మరొకసారి సోషల్ ఫాంటసీ సినిమా లో చిరంజీవి నటించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఇది చిరంజీవి అభిమానులకి పండగలాంటి వార్త అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.