ఈసారి కాస్త వెరైటీ అంటున్న రవితేజ..?
అయితే ఈ సినిమాలో గతంలో రొటీన్ కి భిన్నంగా నటనలో కొత్త మెళుకువలు వెండితెరపై రవితేజ చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్. రవితేజ గత సినిమాలు చూస్తుంటే అన్నీ కూడా ఒకే తరహా నటనలో బాడీ లాంగ్వేజ్ కూడా ఒకేలా ఉండటంతో ఈసారి రాబోతున్న డిస్కో రాజా సినిమా లో మాత్రం చాలా వెరైటీగా రవితేజ వెండితెరపై కనబడుతున్నట్లు ఫిలింనగర్ టాక్.
ముఖ్యంగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టి తిరిగి ఫామ్లోకి రావాలని రవితేజ ప్రతి సీన్ ని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దారుణమైన ఫ్లాపులతో చాలా వరకు తన మార్కెట్ పోగొట్టుకున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టడానికి తీవ్ర కష్ట పడుతున్నారు అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు. మరి డిస్కో రాజా రవితేజ ను ఇండస్ట్రీలో నిలబెడుతుందో లేదో చూడాలి.