ప్రస్తుతం సౌత్ ఇండియాలో పర్ఫెక్ట్ జోడీ అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మాత్రమే! గీత గోవిందం సినిమా అంత సర్క్యూట్ బ్రేకర్ల ను చేదిస్తూ బ్లాక్ బస్టర్-హిట్ కావటానికి ప్రధాన కారణం వారి మద్య ఉన్న ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గీత గోవిందం విడుదలకు ముందు వీళ్లు చేసిన సడి సందడి అంతా ఇంతా కాదు.
కేవలం ట్విట్టర్ మాద్యమంగా వీళ్ళు తమదైన తమకే స్వంతమైన శైలిలో సినిమాను ప్రమోట్ చేశారు. విజయ్, గీతల గిల్లికజ్జాలు నెటిజన్లను కితకితలు పెట్టి బాగా ఆకట్టు కున్నాయి. సినిమా ను నిరంతరం వార్తల్లో నిలబెట్టాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా వీళ్లు చేసిన హల్-చల్ మాత్రం మామూలుగా లేదు. విడుదల తర్వాత కూడా అదే హంగామా కొనసాగింది.
విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న "డియర్ కామ్రేడ్" విషయంలో ఈ ఇద్దరి మద్య కెమిస్ట్రీ మరింత సమ్మొహనం చేస్తూ ఆకట్టుకుంటోంది. గీత గోవిందం సమయంలో రష్మిక మందన్న రక్షిత్ షెట్ట్య్ తో రిలేషన్-షిప్ లో నిండా మునిగి ఉంది. ఈ సినిమా విడుదల తరవాత వివిధ కారణాలతో బ్రేక్-ఉప్ జరిగి విడిపోయి ఫ్రీ-బర్డ్ అయిపోయింది. ఇక ఆమెకు ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేకుందాపోయాయి. స్వేచ్ఛగా విహరించే పక్షిలా విజయ్ తో కెమిష్ట్రీ పండిస్తూ లిప్-లాక్ లతో లాగించేసింది. ఆ సినిమా టీజర్‌కు ముగ్ధ ముద్దే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి ట్విట్టర్లో విజయ్, రష్మికల మధ్య సాగుతున్న సంభాషణ కావచ్చు, ఇద్దరూ ఒకరి ఫొటోలు ఒకరు తీసి వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయడం కావచ్చు, ఇద్దరి సాన్నిహిత్యం కావచ్చు - ఇలా ప్రతి విషయం లోనూ విజయ్, రష్మిక జోడీ కెమిస్ట్రీ జనాల దృష్టిని ఆకర్షిస్తూ తమసినిమా గురించి జనాలు చర్చించుకునేలా చేస్తోంది. ఇలా "ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ" ఈ స్థాయిలో పండిస్తున్న జంట మరొకటి కనిపించదు. "డియర్ కామ్రేడ్" కూడా హిట్టయితే ఈ జోడీపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోయి, నిగికూడా చాలనతగా దూసుకుపోతుంది. త్వరలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా మొదలవతుందన్న దానికి ఎలాంటి సందేహం లేదు.