అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
అయితే ఆ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. ఇక ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి వెండితెరపై తనకు తిరుగులేదని తనను తాను ప్రూవ్ చేసుకొంది. రంగమ్మత్త పాత్ర తో యాంకర్ అనసూయకు వరుస ఆఫర్లు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తనకు డిమాండ్ పెరిగిందని తెలుసుకున్న అనసూయ ఈ సినిమాకి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఆమె అడిగినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రామ్ చరణ్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. ఈ మూవీలో హీరోయిన్ కి సమానంగా అనసూయ పాత్ర ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది.