రకుల్ ప్రీత్ సాయి పల్లవిల మధ్య చిచ్చుపెట్టిన సూర్య పొగడ్తలు !

Seetha Sailaja
‘ఫిదా’ తరువాత సాయి పల్లవి తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపెడుతోంది. తాను నటించే సినిమా కథ మాత్రమే కాకుండా ఆమూవీలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పుడు మాత్రమే సాయి పల్లవి సినిమాలను ఒప్పుకుంటోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఆమె సూర్యాతో నటించిన ‘ఎన్ జి కే’ మూవీ పై సాయి పల్లవి చాల ఆసలు పెట్టుకుంది. ఈ నెలాఖరున విడుదల కాబోతున్న ఈమూవీ తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.  

ఈ సందర్భంగా జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో హీరో సూర్య సాయి పల్లవిని ఆకాశంలోకి ఎత్తేస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సాయి పల్లవి తాను నటించే ప్రతి సీన్ లో పర్ఫెక్ట్ గా రావాలని కోరుకునే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంటూ ఆమె పై సూర్య ప్రశంసలు కురిపించాడు. 

అంతేకాదు ఒకవేళ తాను నటించే సీన్ సరిగ్గా రాకపోతే సాయి పల్లవి ఏడుస్తూ కూర్చుంటుంది అనీ అప్పుడు ఆమెను ఓదార్చడం తనకు శక్తికి మించిన పనిగా మారిందనీ అంటూ సాయి పల్లవి పై సూర్య చేసిన కామెంట్స్ ఆ ఫంక్షన్ కు హాట్ న్యూస్ గా మారాయి. అయితే ఇదే ట్రైలర్ ఫంక్షన్ కు సాయి పల్లవితో కలిసి సూర్యకు మరో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ వచ్చినా సూర్య ఆమెను పెద్దగా ప్రశంసించక పోవడంతో రకుల్ తీవ్ర నిరాశకు గురైంది అంటూ తమిళ మీడియా వార్తలు వ్రాస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: