నెక్స్ట్ సినిమా కి సరైన స్కెచ్ వేసిన పూరి జగన్నాథ్..?
దీనికి కారణం ఏమిటంటే వరుసగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్న క్రమంలో..స్లో అండ్ స్టడీ అన్న రీతిలో ఈసారి ఖచ్చితంగా హిట్ పడాలని రామ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ గత కొన్ని నెలల నుండి జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఈ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
పూరి ఓ డేట్ చెప్పి రిలీజ్ చేయకపోవడం ఇదే మొదటిసారేమో .. కాకపోతే చిత్రబృందం ఆలోచన మరో విధంగా ఉంది. మేలో పెద్ద సినిమాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ సమయంలో రిలీజ్ చేయడం కంటే హడావిడి పూర్తయిన తరువాత రిలీజ్ చేయడం మంచిదని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేని సమయాన్ని చూసి సరైన స్కెచ్ వేసి సినిమాని విడుదల చేసి సేఫ్ గేమ్ ఆడాలనే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది.