హన్సికకు గట్టి దెబ్బ

Prasad
తమిళంలో హిట్టయిన వెట్టె ఆధారంగా నాగచైతన్య, సునీల్ లు హీరోలుగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా తమన్నా నటిస్తోంది. అయితే ముందుగా నాగచైతన్యకు జోడీగా ఈ సినిమా కోసం హన్సిక ను ఎంపిక చేశారు. అయితే నాగచైతన్య కంటే హన్సిక పెద్దగా కనిపిస్తుందన్న ఉద్దేశ్యంతోనూ, నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో గతంలో 100 % లవ్ అనే హిట్ ఉన్న సెంటిమెంట్ తోనూ నాగ చైత్యన్య కు జోడీ గా తాజాగా తమన్నాను ఎంపిక చేశారు. అయితే, ఒకసారి ఎంపిక చేసి తరువాత తొలగిస్తే వారి కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని, ఈ రకంగా ఆలోచిస్తే హన్సికకు ఇది గట్టి దెబ్బే అని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.  గతంలో కందీరగ సినిమాలో హీరోయిన్ గా నటించిన హాన్సిక ఆ చిత్ర హీరో రామ్ కంటే పెద్దదానిలా కనిపించిందనే కామెంట్లు ఎదుర్కొంది. ఇప్పడు ఇదే కామెంట్ తో ఒక సినిమా నుంచి తొలిగించబడటం హన్సిక కెరీర్ కు గట్టి దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: