"నట కిరీటి" ని ఫాలో అవుతున్న "అల్లరి" నరేష్.. కారణం అదే..

Kunchala Govind
నటకిరీటి "డాక్టర్" రాజేంద్రప్రసాద్ నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన మొదట్లో ఎలాంటి పాత్రలు పోషించాలి, ఎటువంటి సినిమాలలో నటించాలి.. అనుకుంటున్న సమయంలో "నందమూరి తారక రామారావు" గారి సలహా మేరకు కామెడి చిత్రాలలో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే రాజేంద్ర ప్రసాద్ కి "నట కిరీటి" అనే బిరుదును సంపాదించి పెట్టింది. కామెడి జోనర్ ను ఎంచుకొని హిట్ ఫ్లాప్ లతో సంబధం లేకుండా ఎన్నో సినిమాలలో హీరోగా నటించి కామేడిలో కూడా ఒక హీరోయిజం ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ సినీ ప్రపంచంలో తన కంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 


అంతేకాదు "క్విక్ గన్ మురుగన్" అనే హాలీవుడ్ సినిమాలోను నటించి నటన పరంగా తన ప్రత్యేకతను హాలీవుడ్ లోను నిరూపించుకున్నారు. అయితే ఒక నటుడు హీరోగానే కాదు ఎలాంటి పాత్రనైనా చేయగలగాలి, చేసి ప్రేక్షకులను మెప్పించాలి...అప్పుడే "నటుడు" అన్న పదానికి పరిపూర్ణమైన అర్థం అని "నట కిరీటి" ఎంచుకున్న పాత్రల ద్వారా సినీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. 


"అల్లరి" సినిమాతో వెండి తెరకు పరిచయమైన "అల్లరి నరేష్" కామేడీ జోనర్‌లో ఎన్నో హిట్స్ ని అందుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సోలో హీరోగా కామెడి జోనర్ లో వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న కారణంగా కంటిన్యూగా సినిమాలు చేయలేకపోతున్నాడు. ఈ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికే "సూపర్ స్టార్" మహేష్ నటించిన మహర్షి సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషించాడు. ఈ తరహా పాత్రలు నరేష్ కి కొత్తేమి కాదు. గతంలో గమ్యం, శంభో శివ శంభో వంటి చిత్రాలలో ఇలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే మహర్షి సినిమా మాత్రం నరేష్ కి క్యారెక్టర్ పరంగా కెరీర్ పరంగా అంతో హెల్ప్ అవుతుందని భావితున్నాడు. ఇక ముందు కూడా రాజేంద్ర ప్రసాద్ ను ఫాలో అవుతూ మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నాడట.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: