యాంకర్ ప్రదీప్ లవ్ ఫెయిల్యూర్.. ఢీ షోలో కన్నీళ్లు పెట్టుకున్న ప్రదీప్..!

shami
బుల్లితెర మీద మేల్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. తెలుగులో ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఉన్నాయో వాటినన్నిటిని ఓ రౌడ్ వేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈటివి ఢీ షోలో ప్రదీప్ యాంకరింగ్ అలరిస్తుంది. ఆ షోలో టీం కెప్టెన్స్ గా ఉన్న సుధీర్, రష్మిలతో ప్రదీప్ చేసే కామెడీ సరదాగా ఉంటుంది. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా షోలో కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.


ఇక ఇంత సరదాగా సాగుతున్న ఢీ షోలో యాంకర్ ప్రదీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు విషయం ఏంటో తెలీదు కాని ప్రదీప్ సాంగ్ పాడుతూ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. తానో లవ్ ఫెయిల్యూర్ అని తెలుస్తుంది. మరి ప్రదీప్ ను కాదన్న ఆ అమ్మాయి ఎవరో తెలియాల్సి ఉంది. ఎప్పుడు సుధీర్, రష్మిలకు టాస్క్ ఇచ్చే ప్రదీప్ ఈసారి తను అందరికి షాక్ ఇచ్చాడు.


పాట పాడి ఆ పాట మధ్యలోనే ఏడ్చేశాడు. మరి ప్రదీప్ ను ఇంతగా గాయపరచిన సందర్భం ఏంటో తెలియాలంటే రేపు బుధవారం ఢీ షో చూడాలి. డ్యాన్స్ తోనే కాదు హ్యూమర్ తో కూడా షో సక్సెస్ అవగా ఇప్పుడు అదే షోలో ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. మరి ప్రదీప్ మాచిరాజుని ఇంతలా డిస్ట్రబ్ చేసిన అమ్మాయి ఎవరో అతని మాటల్లోనే వినాలి.


షోకి ప్రదీప్ యాంకరింగ్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఢీ జడ్జులుగా శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూజా ఉన్నారు. ప్రదీప్ ఎమోషనల్ ఫీల్ తో ఈ వారం ఢీ షో మరింత హిట్ కానుంది. ప్రోమోలో అలా కట్ చేశారా లేక నిజంగానే ప్రదీప్ అలా కన్నీళ్లు పెట్టుకున్నాడా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: