రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పటిదాకా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి ఇద్దరు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీ కి వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అసలు విషయంలోకి వెళితే రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR రూపొందుతున్న విషయం తెలిసిందే.
భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించడం తో అభిమానులకు ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది . అయితే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కి హీరో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అనుష్క 3లేదా 4 నిమిషాల పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో ప్రభాస్, అనుష్క కలసి రాజమౌళి రుణం తీర్చుకుంటున్నారు అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.