సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!

KSK
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఒకరికొకరు చాలెంజ్ చేసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నరు. మొన్నటి వరకు ఐస్ బకెట్ ఛాలెంజ్..తర్వాత స్వచ్ఛభారత్ ఛాలెంజ్ ..కికి ఛాలెంజ్ వంటివి ఒకరికొకరు సవాలు చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ‘రీడింగ్ ఇస్ గుడ్ చాలెంజ్’ అనే క్యాంపెయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ట్రెండి టాపిక్’ గా మారింది.


ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ముద్దుల భార్య అక్కినేని అమల కి రామ్ ప్రసాద్ అనే సెలబ్రిటీ నుండి చాలెంజ్ ఎదురైంది. దీంతో అమల ఆ ఛాలెంజ్ సీరియస్ గా తీసుకుని ఆ సవాల్ ని స్టోరీస్ 'Stories At Work' అనే బుక్ చదవాలని తన ఛాలెంజ్ ని సమంత, ఉపాసన కి చేసింది.


అయితే అమలా చేసిన సవాల్ ని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు అలాగే బయట ప్రముఖులు ఎక్కువగా కాళీ దొరికే సమయాలలో బుక్స్ చదవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ‘రీడింగ్ ఇస్ గుడ్ చాలెంజ్’ లో అమల చేసిన ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: