జూలైలో టాలీవుడ్ హౌస్‌ఫుల్‌.... ఖాళీల్లేవ్‌

VUYYURU SUBHASH
టాలీవుడ్‌లో ఈ స‌మ్మ‌ర్‌ను పెద్ద హీరోలు ఖాళీగా వ‌దిలేశారు. గ‌త రెండు, మూడేళ్లుగా స‌మ్మ‌ర్ వ‌స్తుందంటే మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో వ‌రుస‌గా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేసేవి. ఈ స‌మ్మ‌ర్‌లో ఒక్క మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి మాత్ర‌మే పెద్ద సినిమాగా బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసింది. స‌మ్మ‌ర్ చాలా వ‌ర‌కు పెద్ద హీరోలు వృథాగా వ‌దిలేశారు. ఇక జూన్ నెల‌లో ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ఉంది. ఈ నెల 30 నుంచి జూలై 14 వ‌ర‌కు అంద‌రూ ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌తోనే ఎంజాయ్ చేస్తారు.


భార‌త్ ఆడే రోజుల్లోనే కాకుండా గ్రూప్ ద‌శ‌లో ప్ర‌తి మ్యాచ్ కీల‌కంగా ఉండ‌డంతో పాటు మ‌ధ్యాహ్నం మ్యాచ్‌లు ప్రారంభ‌మై రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కంటిన్యూగా ఉంటాయి. దీంతో ఫ‌స్ట్ షో, సెకండ్ షోలు కూడా చూసేవారు మ్యాజ్‌ను ఎంజాయ్ చేయాల‌నుకుంటే సినిమాల‌కు దూరంగా ఉంటారు. అది ఖ‌చ్చితంగా సినిమాల క‌లెక్ష‌న్ల‌పై ఎఫెక్ట్ ఉంటుంది. 


అందుకే టాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ చేసేవారంతా ఇప్పుడు జూలైనే ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టికే అందుకు త‌గ్గ‌ట్టుగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు. జూలై 12న లేదా ఓ రోజు అటు ఇటుగా శర్వానంద్-సుధీర్ వర్మ కాంబినేషన్ దళపతి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఇదే డేట్ కు పూరి-రామ్ ల ఇస్మార్ట్ శంకర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు వెన‌క్కు త‌గ్గే ఛాన్స్ ఉంది. అదే రోజు క‌న్న‌డ రీమేక్ సినిమా ర్యాంక్ రాజు కూడా వ‌స్తోంది.


ఇక సూప‌ర్ ఫామ్‌లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ జూలై నెలాఖ‌ర‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇవి కాక మ‌రికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా జూలైలోనే వ‌స్తాయి. ఇక ఆగ‌స్టులో ప్ర‌భాస్ సాహో 15కు ఫిక్స్ అయ్యింది. ఇక నాని - విక్ర‌మ్ కె.కుమార్ గ్యాంగ్‌లీడ‌ర్ కూడా ఆగ‌స్టులోనే ఉంది. దీంతో ఇప్పుడు అంద‌రి క‌న్ను జూలై మీదే ఉండ‌డంతో జూలైలో ప‌లువురు ఖ‌ర్చీఫ్‌లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: