మహర్షికి దూరం గా జగపతి బాబు ఇండస్ట్రీ లో ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja
 హీరో నుండి విలన్ గా మారిన తరువాత జగపతి బాబు అందరి టాప్ హీరోలతో నటించాడు. ముఖ్యం గా మహేష్ తో జగపతి బాబుకు చాలా మంచి సన్నిహిత సంభంధాలు ఉన్నాయి .శ్రీమంతుడు మూవీ సూపర్ సక్సస్ లో జగపతి బాబు నటన కీలక పాత్ర పోషించింది అనడం లో ఎటువంటి సందేహంలేదు. 

అయితే అలాంటి జగపతి బాబు  మహర్షి'కి రిలీజ్ తర్వాత జరిగిన  ఏ ప్రమోషన్స్  కార్యక్రమం లో కనిపించక పోవడం పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగు తున్నాయి .ఈ  సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దాంతో సంబంధం లేకుండా 'మహర్షి' సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఈ సమ్మర్ సీజన్ లో ఈ సినిమాను కలెక్షన్స్ పరం గా నిల బెట్టేందుకు  ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ నేపధ్యం లో  రీసెంట్ గా విజయవాడలో   భారీస్థాయిలో జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ కు  'మహర్షి' టీమ్ అంతా హాజరు అయినా  ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన జగపతి బాబు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం కారణం ఏమిటి అన్న కోణం లో చర్చలు జరుగుతున్నాయి  .  వాస్తవానికి విజయవాడలో జరిగిన సక్సెస్ మీట్ మాత్రమే కాదు  'మహర్షి' కి సంబంధించిన ఇతర ప్రమోషన్స్ లో కూడా జగపతి బాబు ఎక్కడా  కనిపించ లేదు. 

అయితే కొందరు ఈ విషయం పై స్పందిస్తూ  జగపతిబాబు షెడ్యూల్ ప్రస్తుతం ఊపిరిసలపకుండా ఉన్న నేపధ్యం లో  డేట్స్ కుదరక జగపతి బాబు మహర్షి ఫంక్షన్ కు డుమ్మా కొట్టాడు అని చెపుతున్నారు . అయితే మరికొందరు మాత్రం మహర్షి షూటింగ్ సమయం లో జగపతి బాబు కు నచ్చని కొన్ని విషయాలు జరిగిన నేపధ్యం లో జగపతి తనకు తానుగా మహర్షి ఫంక్షన్లకు దూరం గా ఉన్నాడు అంటూ మరొక సరి కొత్త గాసిప్పులకు తెర తీస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: