సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయిన న్యాచురల్ స్టార్ నాని..?
ఇదిలా ఉండగా తాజాగా జెర్సీ సినిమా తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్నసినిమా లో సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేదిత థామస్ నటిస్తున్నారు. సుధీర్ బాబు ప్రధాన పాత్ర తరహాలో నటిస్తున్న ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఇదే విధంగా జెంటిల్మెన్ సినిమాలో నటించిన నాని ఆ సినిమాలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.
అయితే తాజాగా చేయబోయే సినిమాలో మాత్రం నాని ని ప్రేక్షకులు ఎవరు ఊహించని విధంగా చూపించబోతున్నారట డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. అయితే ఒక మంచి కారణం వల్ల నాని ఈ సినిమాలో ప్రతికూల పాత్రలో నటిస్తాడని..ఆ కారణాన్ని మెయిన్ లైన్ గా తీసుకునే ఈ సినిమా స్టోరీని నడిపిస్తారట డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట సినిమా యూనిట్. మొత్తంమీద చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని మరొక సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.