నా పేరు ఇప్పుడు మారిపోయింది అంటున్న సమంత..!
అయితే అప్పట్లో నాగచైతన్య పెళ్లి అయ్యాక మార్చుకుంటే ఇప్పుడు తాజాగా పేరు మార్చడానికి అవసరం ఒకసారి గమనిస్తే..బలమైన కారణమే ఉంది. అది మరోదో కాదు సమంత తాజా చిత్రం.. `ఓ బేబీ` చిత్రం. ఈ చిత్రం లో సమంత పేరు బేబి. అలాగే సినిమా పేరు కూడా ఓ బేబి. దాంతో సినిమా ప్రమోషన్ కు కలిసొస్తుందని సమంత తెలివిగా ఇలా సోషల్ మీడియాతో తన పేరు మార్చుకుందన్నమాట.
ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. “నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి.. చూస్తారు గా” అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో రూపొందించిన చిత్రం ఓ బేబీ. త్వరలో రిలీజ్ అవునన్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తాజాగా మొదలయ్యాయి.