చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్..పక్కన ఎవరు?..ఫోటో వైరల్!

siri Madhukar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీనీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోలు వరుసగా రావడానికి ఆయన వేసిన పునాది అలాంటిది.  పునాధిరాళ్లు సినిమాతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి..ఎన్నో కష్టనష్టాలకు వొర్చి..అప్పట్లో టాప్ హీరో పోటీని తట్టుకుంటూ తన ప్రతిభతో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు.  అలాంటి మెగాస్టార్ ఇంట అప్పట్లో పెను వివాదం టీవిల్లో, ప్రింట్ మీడియాలో దుమారం రేపింది. 

ఆయన చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అప్పట్లో ఈ వివాదం పై పవన్ కళ్యాన్ రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.  ఒక పాప పుట్టిన తర్వాత  ఇద్దరి మధ్య కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు. కొంతకాలం తరువాత శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకొంది.

ప్రస్తుతం ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది.  అప్పట్లో  శిరీష్ భరద్వాజ్ బీజేపీలో చేరడం..పార్టీ పరంగా పెద్ద స్థాయికి వెళ్తారని..పోటీ కూడా చేయబోతున్నాడని రక రకా వార్తలు వచ్చాయి...కానీ అవేవీ జరగలేదు.  తాజాగా  శిరీష్ భరద్వాజ్ కి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.  శిరీష్ తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేశాడు.

ఆ పోస్ట్ లో ఆమెని పెళ్లి చేసుకున్నట్లు ఏమీ వెల్లడించలేదు కానీ నెటిజన్లు మాత్రం హ్యాపీ మేరీడ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతున్నారు. కాకపోతే తన గర్ల్ ఫ్రెండ్ గురించి పెద్దా పెద్దగా వివరాలు మాత్రం వెల్లడించలేదు. దాంతో వీరిద్దరికి వివాహం జరిగే ఉంటుందని నెటిజన్లు ఆనుమానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: