ఫ్యామిలి గర్ల్ ను కాదు - ప్లే గర్ల్ ను నేను: మరీ బరితెగింపు

టాలీవుడ్ లో ఆ మాటకొస్తే  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం ఆమె. ఆమె నోట్లో పడ్డ ఏ వ్యక్తైనా ఆమె విపరీత ఆరోపణల వలయంలో చిక్కుకోవాల్సిందే.  పవనైనా జగనైనా ఎవరైనా ఒకటే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేదే ఈ టాలీవుడ్ సంచలనం. 

మీ టూ… కాస్టింగ్ కౌచ్ ను టాలీవుడ్ లో ప్రచారంలోకి తెచ్చి మహామహుల బూతు బాగోతాలను, చీకటి బ్రతుకులను, తాను ముప్పాతిక నగ్నమై వారి బ్రతుకులను పూర్తి నగ్నంగా నడిరోడ్లపై కీడ్చిన ఆటం బాంబ్ శ్రీరెడ్డి.

అయితే ఆమె  తన పెళ్లి  విషయంలో కూడా అంతకు మించిన  నిర్మొహమాటంతోనే కాదు నిర్లజ్జగా తన అభిప్రాయన్ని ప్రకటించింది.  తన మైండ్-సెట్ ప్రకారం తనకు ఒక పెళ్లి సరిపోదని స్పష్టం చేసింది. తనకు నచ్చినట్టు తాను తన జీవితాన్ని అనుభవించాలని అనుకుంటున్నానని తేల్చేసింది. 

‘పెళ్లికి, మనకు సెట్ కాదులే’  అని స్పష్టంగా చెప్పింది శ్రీరెడ్డి. అదే సమయంలో డేటింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డేటింగ్ చేస్తే, మహా అయితే ఒక ఏడాది అతనితో గడుపుతానని తెలిపింది. 

ఆతర్వాత తనకు కొత్తప్రేమ కావాలని అనిపిస్తుందని ప్రకటించింది. తాను ప్లేగర్ల్ టైప్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌ లో కాస్టింగ్ కౌచ్ వివాదంతో దుమారం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయింది. తమిళ బిగ్-బాస్‌ కార్యక్రమంలో పాల్గొనబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: