పవన్ సెలెక్ట్ చేశారు... రాజమౌళి క్రెడిట్ ఇచ్చారు..!!

Sirini Sita
తెలుగు సినిమాల్లో అజయ్ విలన్ పాత్రలు ఎక్కువ చేశాడు.  చాలా తక్కువ సినిమాల్లోనే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిశాడు.  పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తరువాత విజయ్ కు లక్ కలిసొచ్చింది.  వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  ఖుషి సినిమాలో స్టూడెంట్ గా, పవన్ కళ్యాణ్ స్నేహితుడిలో ఒకడిగా చేశాడు. 


ఖుషి సినిమాలో పాత్ర కోసం పవన్ అజయ్ ను ఏరికోరి ఎంపిక చేశారట.   ఆ తరువాత అజయ్ కు అవకాశాలు వరసగా వచ్చాయి.  విలన్ గా కొన్ని సినిమాలు చేసినా రాజమౌళి విక్రమార్కుడు సినిమాలోని రోల్ తనకు ఎంతగానో నచ్చిందని.. సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు.  


 మరలా అలాంటి విలన్ రోల్ చేయడం కష్టం అని చెప్పిన అజయ్.. ఆ సినిమాలో తనకు వచ్చిన క్రెడిట్ అంతా రాజమౌళిగారు ఇచ్చిందే అని అన్నాడు.  రాజమౌళి తో సినిమా చేయడం అదృష్టం అని చెప్పాడు అజయ్.  అజయ్ ఆర్టిస్ట్ గానే కాకుండా అప్పుడప్పుడు హీరోగా కూడా కనిపిస్తున్నాడు.  


హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాము అన్నది పక్కన పెడితే.. మంచి సినిమాలు చేయడానికి స్కోప్ దొరుకుందని అందుకే అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు అజయ్ చెప్తున్నాడు. ఏ సినిమా అఫర్ దొరికితే ఆ సినిమా చేస్తున్నట్టు అజయ్ చేస్తున్నట్టు అజయ్ చెప్పుకొచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: