తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విప్లవ దర్శకులు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయారు. ఆ తర్వాత విలన్ గా నటించిన తర్వాత యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగాగోపిచంద్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో తన తదుపరి చిత్రంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.
తాజాగా గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఇక గోపీచంద్ లుక్ పరంగా చూస్తుంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, మాసీ లుక్‌లో గోపీచంద్ ఈ సినిమాలో రివేంజ్ తీర్చుకునే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని దర్శకుడు తిరు శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. గోపీ చంద్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు.