బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు. దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమా స్టామినాఏంటో చెప్పకనే చెప్పింది. ఈ సినిమా తరువాత ఆ స్థాయిలో నిర్మితమయ్యే సినిమాలు పెరిగిపోయాయి.
మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాయి. అయినా బాహుబలి రికార్డును తెలుగు సినిమా బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను కలెక్షన్లను బ్రేక్ చేసే సినిమా రాబోతున్నది. అదే ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు. పాన్ ఇండియా మూవీ గా షూట్ చేస్తున్నారు. బాగుంది . రాజమౌళి దర్శకుడు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు కాబట్టి సినిమా తప్పకుండా హిట్ కొడుతోంది.
పైగా ఇది పీరియాడికల్ స్టోరీ కావడంతో అంచనాలు పెరిగాయి. సినిమా రిలీజ్ కు ముందు బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసింది.ఎలాగంటే .. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు 72 కోట్ల రూపాయలు ఫర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. రిలీజ్ తరువాత తప్పకుండా బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయం అని అంటున్నారు.