వరుణ్ తేజ్ ప్రవర్తనలో పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
ప్రస్తుతం మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న వాల్మీకి మూవీ షూటింగ్ కర్నూల్ ప్రాంతంలో జరుగుతోంది. కొద్ది రోజులక్రితం వరుణ్ తేజ్ ఒక పెద్ద కారు యాక్సిడెంట్ ప్రమాదం నుంచి గాయాలు లేకుండా బయటపడి ఆ షాక్ నుండి వెంటనే తేరుకుని ఆ సంఘటన జరిగిన మరునాడే ఆమూవీ షూటింగ్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ ప్రవర్తన అతడి కమిట్ మెంట్ ను సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో కర్నూల్ ప్రాంతంలో జరుగుతున్న ఈమూవీ షూటింగ్ ను చూడటానికి వచ్చిన మెగా అభిమానులు కొందరు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈమూవీలో నటిస్తున్న వరుణ్ తేజ్ తన పాత్ర కోసం పెంచుకున్న గెడ్డం లుక్ చూసిన వారు అచ్చు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పెంచుకున్న గెడ్డం లా ఉంది అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. 

దీనికితోడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఈసినిమాలో వరుణ్ తేజ్ పాత్ర కోసం క్రియేట్ చేసిన ఒక డైలాగ్ ను ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో చిత్రీకరించినట్లు టాక్. ఒక ఫైట్ సీన్ లో వరుణ్ తేజ్ చేసిన ఫైట్ ను చూసి విలన్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి ‘కత్తి పట్టిన పవన్ కళ్యాణ్ లా ఉన్నాడు ఏమిటి’ అంటూ చిత్రీకరించిన ఈ డైలాగ్ ను షూటింగ్ స్పాట్ లో విన్న యూనిట్ సభ్యులతో పాటు అక్కడ ఆమూవీ షూటింగ్ చూడటానికి వచ్చిన మెగా అభిమానులు కూడ తెగ ఎంజాయ్ చేసినట్లు టాక్. 

దీనితో రానున్న రోజులలో పవన్ వీరాభిమానులకు పవన్ లేని లోటును వరుణ్ తేజ్ తీరుస్తాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’ రీమేక్ గా తీయబడుతున్న ఈమూవీ ఘన విజయం సాధిస్తుందని దర్శకుడు హరీష్ శంకర్ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: