పవన్ కల్యాణ్ అంతా సడన్ గా అక్కడికి ఎందుకు వెళుతున్నాడు ?
అయితే ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అమెరికా లో జరగబోతున్న 'తానా' సభలకు సడన్ గా వెళుతున్న సమయంలో ఇప్పుడు ఈ వార్త పొలిటికల్ సర్కిల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అమెరికాలో ఉండే తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తానా' సభలకు మొట్టమొదటిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తామని నిర్వాహకులు అనుకున్నారు.
కానీ చంద్రబాబు ఓడిపోవడంతో తానా సభ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ ను ఒప్పించి, రప్పించే బాధ్యతను తెలుగునాట ఓ మీడియా ఛానెల్ అధిపతికి అప్పగించినట్లు, ఆయనే దగ్గర వుండి పవన్ ను తోడ్కోని తీసుకువెళ్తారని కూడా వినిపిస్తోంది. పవన్ కు ఆ మీడియా ఛానెల్ అధిపతికి చిరకాలంగా మంచి సంబంధాలే వున్నాయి. అప్పట్లో పవన్ కు ఓ ఖరీదైన కారు కూడా బహుబతిగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో ఆ మీడియా అధినేత తో ఉన్న సత్సంబంధాలు చెడిపోకుండా ఉండడానికి అడిగిన మాట కాదనలేక పవన్ కళ్యాణ్ 'తానా' సభలకు వెళ్తున్నట్లు ఇండస్ట్రీ లో పొలిటికల్ వర్గాల్లో టాక్.