పవన్ నిర్మాణంలో రామ్చరణ్, త్రివిక్రమ్ కాంబో రెడీ..!

Sirini Sita

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సినిమా రంగానికి పూర్తిగా దూర‌మ‌య్యారు. ఎన్నిక‌లు త‌ర్వాత ఈయ‌న మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాను సినిమాల్లో న‌టించ‌న‌ని ప‌వ‌న్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

 

అయితే ప‌వ‌న్‌, సినిమా రంగానికి పూర్తిగా దూరం కావాల‌నుకోవ‌డం లేద‌ట‌. కాబ‌ట్టి ప‌వ‌న్ నిర్మాణ రంగం వైపు దృష్టి సారిస్తున్నార‌ని టాక్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ క్రియేటివ్ వ‌ర్క్స్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసిన ప‌వ‌న్ ఇది వ‌ర‌కు ఈ బ్యాన‌ర్‌పై కొన్ని సినిమాల‌ను నిర్మించారు.

 

ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్ విన‌ప‌డుతుంది. ఇది వ‌ర‌కే త‌న స్నేహితుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ను చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని కోరార‌ట ప‌వ‌న్‌. అందుక‌ని త్రివిక్ర‌మ్ చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా 2019 చివ‌ర, లేకుంటే 2020 ప్ర‌థ‌మార్థంలో పూర్త‌వుతుంది.

 

కాబ‌ట్టి `ఆర్ ఆర్ ఆర్‌` త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో చరణ్ సినిమా చేస్తారట. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స్వంత బ్యాన‌ర్‌పై నిర్మిస్తార‌ని అంటున్నారు. ఇది ఒకరకంగా పవన్ అండ్ చరణ్ అభిమానులకు ఒక సంక్రాతి పండగ లాంటిది. మ‌రి దీనిపై మెగా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: