బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..?
2010లో షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ సల్మాన్ ఖాన్ టెలివిజన్ ప్రేక్షకుల హృదయాలను అలరిస్తూ టెలివిజన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఈ షోలో మధ్యలో కొంతమంది సల్మాన్ కి పోటీ ఇవ్వడానికి వచ్చినప్పటికీ షోలు అంతగా క్లిక్కవ్వలేదు. మళ్ళీ సల్మాన్ అయితేనే బిగ్ బాస్ కి బెస్ట్ అని నిర్వాహకులు అతనికి అడిగినంత ఇస్తూ వస్తున్నారు.
ఇక ఇప్పుడు 13వ సీజన్ కోసం సల్మాన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు 403కోట్ల రెమ్యునరేషన్ ని ఇవ్వనున్నారని టాక్ వస్తోంది. అంటే సల్మాన్ ఎపిసోడ్ కి 31కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. జరిగే 26 ఎపిసోడ్లకు సల్మాన్ ఈ విధమైన రేటు చెప్పడం నిర్వాహకులకు మింగుడుపడటం లేదు. మరో హీరోతో వర్క్ చేద్దామంటే సల్మాన్ రేంజ్ లో ఎవరు షోని లీడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.