టి-22 ...
టి 22 అంతే అదేదో క్రికెట్ మ్యాచ్ అనుకున్నారు సుమీ.. అది కాదండోయ్. శివకుమార్ బి దర్శకత్వంలో మా ఆరుూ ప్రొడక్షన్స్‌పై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా రూపొందనున్న చిత్రం-22. బ్యానర్ లోగో, టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. లోగోను నిర్మాత సి కల్యాణ్ ఆవిష్కరిస్తే, డైరెక్టర్ వివి వినాయక్ టైటిల్‌ను ప్రకటించాడు.
వినాయక్ మాట్లాడుతూ ‘శివ నాదగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. సినిమాపై అంకితభావం చూపించే వ్యక్తికి దర్శకుడు చాన్స్ రావడం మంచి విషయం. 22 టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రాన్ని జూలై 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. శివ పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. హీరో రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్, చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘కొత్త దర్శకుడు కొత్త కానె్సప్ట్‌తో రావడం హ్యాపీగా ఉంది. పరిశ్రమతో బాగా పరిచయాలున్న తండ్రి బిఎ రాజు మీద ఆధారపడకుండా, ప్యాషన్‌తో ఓ వెబ్ సిరీస్‌కి డైరెక్ట్ చేసి తన ప్రతిభ చూపించాడు. వెబ్ సిరీస్‌లోని హీరోనే హీరోగా పెట్టుకుని సినిమా తీయడం సామాన్య విషయంకాదు. 22 టైటిల్ ఇన్నోవేటివ్‌గా ఉంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నాడు.
నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ ‘దర్శకురాలు దివంగత జయ ఎక్కడున్నా సంతోషించే రోజిది. శివ దర్శకుడు అవ్వాలని ఆమె కలలు కనేది. దర్శకుడికి ప్రొడక్షన్ మీద కంట్రోల్ ఉండటం చాలా అవసరం. శివ దగ్గర ఆ పనితనం ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువగా మంచి సినిమాలు చెయ్యాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.