పబ్లిక్ లో సిగరెట్ తాగి పోలీసులకు ఫైన్ కట్టిన రామ్..?
మనకందరికీ తెలిసినదే బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగటం నిషేధమని. దీంతో తాజాగా షూటింగ్ సమయంలో రామ్ సిగరెట్ తాగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు 200 రూపాయలు జరిమానా విధించడంతో సినిమా యూనిట్ కట్టడం జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ క్రమంలో ఈ సినిమాని జూలై 12 వ తారీఖున విడుదల చేయాలని భావించారు.
అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జూలై 14న జరుగనున్న నేపథ్యంలో ఆ సమయంలో క్రికెట్ ఫీవర్ ఉన్న క్రమంలో సినిమాని జూలై 18న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రామ్ సినిమా కోసం బాగా కష్టపడ్డారు.