విజయనిర్మల రికార్డ్ ఎవరూ బద్దలుకొట్టలేనిది...!!

Satya
బాలనటిగా రంగప్రవేశం చేసి అన్న నందమూరి తారక రామారావు పాండురంగ మహత్స్యం సినిమాలో చిన్ని క్రిష్ణుడిగా నటించి మెప్పించిన నటీమణి విజయనిర్మల. ఆ తరువాత రంగుల రాట్నం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి  చిత్రంలోనే నంది అవార్డ్ సొంతం చేసుకున్న ఘనాపాఠి ఆమె ఇక విజయనిర్మల పేరులోనే విజయం వుంది


ఆమె ప్రపంచ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎవరూ చేయలేని  అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. మహిళా దర్శకురాలిగా ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కానే కాదు. దర్శకత్వం వహించడం అంటే అన్ని శాఖల పట్ల కచ్చితమైన అవగాహనతో పాటు, అందరినీ కలిపి ముందుకు నడిపించే టీం వర్క్ ఉండాలి. కెప్టెన్ గా ఉండాలి. ఆ దక్షత విజయనిర్మలకు ఉంది కాబట్టే ఆమె నెగ్గుకురాగలిగారు.


ఇక విజయనిర్మల నటిగా కూడా తనదైన శైలిని కనబరచారు. లేడీ ఓరిఎంటెడ్ మూవీ మీనాలో ఆమె కనబరచిన నటనకు ప్రశంసలు కురిసాయి. ఇక దేవదాస్ వంటి కళాఖండాన్ని మళ్ళీ నిర్మించి  దర్శకత్వం వహించడం ఓ సాహసం. దాన్ని విజయనిర్మల చేయగలిగారంటే ఆమె గ్రేట్ అనకతప్పదు. క్రిష్ణ దేవదాస్ టెక్నికల్ గా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ సంగతి అందరూ అంగీకరించాల్సిందే. 


ఎంతో ప్రతిభావంతురాలైన విజయనిర్మలకు పద్మశ్రీ అవార్డ్ కూడా రాకపోవడం బాధాకరమే. గిన్నీస్ రికార్డ్ కి ఎక్కి ప్రపంచ సినీ చరిత్రలో తెలుగు వారి కీర్తిని నిలిపిన నటీమణి, దర్శకురాలిని పద్మ  అవార్డ్ తో సత్కరించుకోలేకపోవడం నిజంగా బాధాకరమే. ఏది ఏమైనా నాటి తరంలోని ఆణిముత్యం లాంటి నటీమణి దర్శకురాలు నేలరాలిందని చెప్పకతప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: