బన్నీ ఆయనకు హ్యాండిచ్చాడా.....??

Mari Sithara
తెలుగులో మాధవన్, మీరాజాస్మిన్ జంటగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా రన్ తో మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు లింగుసామి. అయితే అంతకుముందు తమిళ్ లో ఆనందం అనే మరొక తమిళ సినిమాకు అయన దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఆ తరువాత అయన విశాల్ తో తీసిన పందెం కోడి సినిమా తమిళం సహా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమాతో మంచి మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లింగుసామి, ఆపై  కార్తీ హీరోగా వచ్చిన ఆవారాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు . 

అయితే ఆ తరువాత ఆయనకు హిట్స్ పెద్దగా రాలేదు. అయన విక్రమ్ తో తీసిన భీమ, సూర్య తో తీసిన సికిందర్, అలానే ఇటీవల విశాల్ తో తీసిన పందెం కోడి 2 సినిమాలు కూడా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను అధికారిక పూజ కార్యక్రమాలతో ప్రారంభించిన లింగుసామి, అర్ధాంతరంగా ఆ ప్రాజెక్టు ను ఆపేసినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమా స్థానంలో అయన మరొక టాలీవుడ్ హీరో హవీష్ తో మరొక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా హవీష్ కు కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని ఇస్తుంది అంటున్నారు. మరి అయితే బన్నీతో చేయబోయే సినిమా పరిస్థితి ఏంటి అనేది అందరిలోనూ జరుగుతున్న చర్చ . 

ఇక కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, కథ విషయంలో కొన్ని లోపాల కారణంగా ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయినట్లు చెప్తున్నారు. స్వతహాగా సూపర్ స్టార్ మహేష్ కు మంచి అభిమాని అయిన లింగుసామి, ఎప్పటినుండో ఆయనతో సినిమా తీయాలని భావించి కుదరక దానిని వదిలేసుకున్నాడు, ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా అటకెక్కడంతో ఆఖరుకి హవీష్ తో సినిమా తీస్తున్నాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తిగా నిజానిజాలు తెలియాల్సి ఉంది....!!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: