ఈ మద్య కాలంలో బాలీవుడ్ హీరోలు ఏదో ఒక కాంట్రవర్సీ విషయంలో సోషల్ మీడియాలోకి ఎక్కుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ పై హైదరాబాదులోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఫిట్నెస్ ప్యాకేజీ పేరిట రూ. 17,490 నుంచి 36,400 వరకూ వసూలు చేశారని..ఈ విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని నిర్వాహకులను ప్రశ్నిస్తే వెబ్సైట్లో బ్లాక్ చేస్తున్నారని శశి ఆరోపించారు. గత సంవత్సరం కల్ట్ ఫిట్నెస్ సెంటర్ సభ్యత్వం తీసుకున్నానని..ఆ సమయంలో ఫిట్ నెస్ గురించి ఎన్నో ఆశలూ చూపించారని అయితే ఆ జిమ్ సామర్థ్యాన్ని మించి మొత్తం 1800 మంది సభ్యులను జిమ్‌లో చేర్చుకున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే తాను జిమ్ చేసేందుకు సరైన ఇవ్వకపోవడంపై శశికాంత్ జిమ్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేసాడు. సమస్య పరిష్కరించాల్సింది పోయి జిమ్‌కు రాకుండా అతడి కల్ట్.ఫిట్ యాప్‌ను నిలిపి వేశారు. ఈ నేపథ్యంతో తనలాంటి వారిని హామీలతో మోసం చేస్తున్నారని కల్ట్.ఫిట్ సంస్థ డైరెక్టర్లు ముఖేష్ బన్సాల్, అంకిత్ అగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్యలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో హృతిక్ రోషన్‌పై శశి ఫిర్యాదు చేశాడు.