‘ఓ బేబీ’ కట్టి పడేసింది: బన్ని

Edari Rama Krishna
ప్రముఖ దర్శకురాలు నందిని దర్శకత్వంలో అక్కినేని సమంత నటించిన ‘ఓ బేబీ’ మూవీ రిలీజ్ అయిన సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సమంత నటనలకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు.  గత కొంత కాలంగా ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్న సమంత ‘ఓ బేబీ’ మూవీలో తన విశ్వరూపం చూపించింది.  తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. 

ఈ మూవీపై ముఖ్యంగా సమంత నటనపై ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఓ బేబీ’ గురించి స్పందించారు.  'ఓ బేబీ' చిత్రం తనను కట్టి పడేసిందని... సమంత నటన అత్యద్భుతమని కితాబిచ్చాడు. ఇక నందిని రెడ్డి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుందని అన్నారు. 70 ఏళ్ల బామ్మ.. పాతికేళ్ల భామ‌గా మారిపోతే త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే క‌థ‌తో ఓ బేబీ వ‌చ్చింది. 

బన్నీ అభినందనలపై నందినిరెడ్డి స్పందించింది. తనను అన్ని వేళలా ప్రోత్సహిస్తున్న బన్నీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. బన్నీతో కలసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో సీనియర్ నటి లక్ష్మీ, హీరో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ లు నటించారు. 
Thank you @alluarjun for always motivating me and believing I can be better 🤗🤗🤗.... your words about #OhBaby made my day.... you are the best Bunny 😍😍😍😍 pic.twitter.com/YmUUpwji8N

— Baby Reddy (@nandureddy4u) July 8, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: