సందీప్ వంగా కు బాలీవుడ్‌లో 100 కోట్ల భారీ ఆఫర్..?

Kunchala Govind
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరక్టర్ సందీప్ వంగా, అంతకు మించిన సంచలనాన్ని బాలీవుడ్ లో క్రియోట్ చేశాడు. విమర్శలు, ప్రశంసలు, కలెక్షన్లు ఇలా అన్నీకలిసి సందీప్ పేరును బాలీవుడ్ లో మారుమోగేలా చేసాయి. అందుకు ఫలితంగా బాలీవుడ్ లో అప్పుడే సందీప్ కోసం ఆఫర్లు లైన్ కడుతున్నాయి.

ఇద్దరు బడా నిర్మాతలు వందకోట్ల రేంజ్ ప్యాకేజ్ లు ఆఫర్ చేస్తున్నారట. ఫస్ట్ కాపీ ఇవ్వండి, వంద కోట్లు తీసుకోండి అనే భారీ ఆఫర్లు ఇప్పుడు సందీప్ వంగా దగ్గర రెడీగా వున్నాయి. 
వాస్తవానికి సందీప్ వంగా కోసం సల్మాన్ ఖాన్ కూడా రెడీ అని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తెలుగులో మైత్రీమూవీస్, ఆసియన్ సునీల్ వంటి నిర్మాతలు సందీప్ వంగా బాలీవుడ్ సినిమా ఫినిష్ చేసి, తెలుగులోకి వస్తాడని ఎదురుచూస్తున్నారు. మహేష్ కు గతంలో లైన్ చెప్పాడు. అయితే మహేష్ దానిని ఓకె చేయలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో మరి తెలుగులోకి వచ్చి, ఇక్కడ హీరోలకు తగినట్లు కథలు చెప్పడానికి ట్రయ్ చేస్తాడా? లేదా వందల కోట్ల ఆఫర్లకు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తాడా? అన్నది చూడాలి. అయితే సందీప్ వంగా తరువాత సినిమా కూడా బాలీవుడ్ లోనే వుండబోతోందని రీసెంట్‌గా వార్తలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో సందీప్ ఎం క్లారిటీ ఇస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: