తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని ఇటీవల ‘జర్సీ’చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం పోస్టర్ ద్వారా ప్రకటించారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొంటున్నాయి..ఎందుకంటే ఇప్పటి వరకు నాని కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడట.
ఈ నెల 15న మూవీ ఫస్ట్ లుక్ తో పాటు 18న మొదటి పాటను విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 24న సినిమా టీజర్ ను కూడా ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రం నానికి ఎంత వరకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి.